హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం వర్షం కురుస్తోంది. వాతావరణం మేఘావృతంగా మారి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, చర్లపల్లి, తార్నాక, మల్లాపూర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ), వనస్థలిపురం, నాగోల్, రామంతపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రాబోయే గంటల్లో కూకట్‌పల్లి, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, హఫీజ్‌పేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.