KNL | టీడీపీకి కార్యకర్తలే బలం.. ఎంపీ నాగరాజు

కర్నూలు బ్యూరో, మే 18, (ఆంధ్రప్రభ) : తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ హాల్ లో నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ… తాను కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తల కృషితోనే కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండి, పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply