హైదరాబాద్ : అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాద కారణాలపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 6.16 గంటల సమయంలో ఫైర్ సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని మంటలను ఆర్పేశారు. అగ్నిప్రమాదంలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు.

వారిలో ఎక్కువ మంది మరణించారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు.అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం లేదని, ప్రమాద వశాత్తు జరిగిందని చెప్పారు. ఏ అధికారి నిర్లక్ష్యం చేయకుండా ప్రమాద తీవ్రతను తగ్గించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సంతాపం తెలుపుతున్నది. ఘటనలో 17 మంది ఉన్నారని, ఎంతమంది చనిపోయారనేది అధికారికంగా తెలియాల్సి ఉందని చెప్పారు.