విజయవాడ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మధ్యం కేసులో నిన్న అరెస్టయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలను ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు.
కాగా, కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత, న్యాయస్థానం ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైల్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలను ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు కోర్టు సూచించింది.