నిజామాబాద్ ప్రతినిధి, మే11 (ఆంధ్రప్రభ) : ఆపరేషన్ సిందూర్ లో పాల్గొంటున్న వీర సైనికులకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ విజయం చేకూర్చాలని భగవంతుడిని వేడుకున్నట్లు ధర్మపురి అరవింద్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు “మనం సైతం దేశం కోసం” కార్యక్రమంలో భాగంగా సరిహద్దుల వద్ద పోరాడుతున్న సైనికులకు విజయం, ఆయురారోగ్యాలను వృద్ధి చెం దాలని కాంక్షిస్తూ ఆదివారం నిజామాబాద్ నగరంలోని సారంగాపూర్ హనుమాన్ మందిరంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారితో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈసందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కాశ్మీర్ లోని పహల్గామ్ ఘటనలో 27మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన అనంతరం ఆపరేషన్ సిందూర్ లో పాల్గొంటున్న ప్రతి సైనికుడిని ఆ భగవంతుడు సదా కాపాడాలని వేడుకున్నారు. మనం సైతం దేశం కోసం కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరి గిందన్నారు. ఆ రాముల వారి హనుమంతుడి ఆశీస్సులతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని కోరారు. అదేవిధంగా ఈ యుద్ధంలో అమరులైన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూర్చాలని ఎంపీ కోరారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, బీజేపీ రాష్ట్ర నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
