పాకిస్థాన్ నిఘా వ్యవస్థకే అందనంత ఎత్తులోనే కాదు.. అగ్ర దేశాలు అమెరికా, రష్యా, చైనా దేశాలకే కొరుకు పడని బాహుబలిగా భారత్ అవతరించింది. శత్రుదేశాల క్షిపణులను వేటాడే వెంటాడి శక్తి ఉందని తాజాగా పాకిస్థాన్ డ్రోన్లను కుప్పకూల్చేసింది. రష్యన్ ఎస్ -400 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టంను తన స్వదేశీ క్షిపణి ఆకాశ్‌ను అనుసంధానించి.. శత్రువును ఇట్టే తరిమికొట్టే శక్తిని ప్రదర్శించింది. ఇప్పుడు భారత్ చేతిలో ఉన్న సుదర్శన చక్రం యావత్ శత్రుదేశాల గుండెల్లో అలజడి రేపుతోంది. యుద్ధంలో శత్రువుపై దాడి చేయాలనే కాంక్ష ఎంత ఉన్నా.. ఆత్మరక్షణ వ్యవస్థ అత్యవసరం. ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ ఉక్రోషంతో రగిలిపోయి మరీ భారత సైన్యాన్ని రెచ్చగొట్టింది. డ్రోన్లతో బాంబుల దాడికి దిగింది. కానీ, ఈ బాంబులను, డ్రోన్లను ఆకాశంలోనే భారత వాయుదళం తునాతుకలు చేసి.. తన సుదర్శన చక్రాయుధం సత్తాను నిరూపించింది. ఈ స్థితిలో ప్రపంచ దేశాలన్నీ నోళ్లు వెళ్లబెట్టాయి. అమ్మో భారత్ అంటే సామాన్యం కాదు.. అని ఓ నిర్ధారణకు వచ్చాయి.
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్ : ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ కీలకం. అడ్వాన్స్‌డ్ మిసైల్ షీల్డ్ అని పిలుస్తారు. ఇరాన్ మిసైల్స్ కావొచ్చు, హమాస్ రాకెట్ల కావొచ్చు, హౌతీ రెబల్ డ్రోన్లు కావొచ్చు..తమ గగనతలంలోకి ప్రవేశిస్తే చాలు ఐరన్ డోమ్ సాయంతో ఆకాశంలోనే ఇజ్రాయెల్ నాశనం చేస్తుంది. భారత్ సైన్యం కూడా ఇదే రీతిలో సుదర్శన డోమ్ ను క్రియేట్ చేసింది. బుధవారం పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది.కానీ ఈ దాడులలో ఏ ఆయుధాలను ప్రయోగించిందో భారత్ పేర్కొన లేదు. వివిధ ఆయుధాలతో ఆరు ప్రాంతాల్లో 24 దాడులు చేసిందని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి చెప్పారు. ఈ దాడుల్లో భారత్‌కు చెందిన ఐదు వైమానిక యుద్ధ విమానాలను, ఒక డ్రోన్‌ను కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి చెప్పుకున్నారు. భారత్ ఇంతవరకు ఈ అంశంపై వ్యాఖ్యానించలేదు
ఆయుధాల సేకరణం
2019 నుంచి రెండు దేశాలు కొత్త రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర ఇప్పుడు ఫ్రాన్స్‌లో తయారైన 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం, అదే కాలంలో చైనా నుంచి పాకిస్తాన్ కనీసం 20 అధునాతన జే-10 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. వీటిలో పీఎల్-15 మిసైల్స్ ఉన్నాయి. ఇక, వాయు రక్షణ దళం విషయానికొస్తే.. 2019 తర్వాత, రష్యన్ ఎస్ -400 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టంను భారత్ కొనుగోలు చేసింది. ఇదే సమయంలో చైనా నుంచి హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పాకిస్తాన్. కొనుగోలు చేసింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ సామర్థ్యాలలో అడ్వాన్స్‌డ్ ఏరియల్ ప్లాట్‌ఫామ్స్, హై టు మీడియం ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం (హెచ్ఐఎంఏడీఎస్), అన్‌మ్యాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికిల్స్ ను పాకిస్తాన్ సమకూర్చుకుంది. ఇక, స్పేస్, సైబర్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టంలు కూడా ఉన్నాయి. కానీ పాకిస్తాన్‌పై భారత మిసైల్ దాడిని పాకిస్థాన్ ఎందుకు అడ్డుకోలేక పోయింది?
చేతిలో చైనా హెచ్ క్యూ 9 ఉన్నా…
పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంకు స్వల్ప-శ్రేణి, మధ్యస్థ-శ్రేణి, దీర్ఘ-శ్రేణి ఉపరితలం నుంచి ఉపరితల క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉందని పాక్ ఎయిర్‌ఫోర్స్ మాజీ వైస్ ఎయిర్ మార్షల్ ఇక్రముల్లా భట్టి అన్నారు. ఇక్రముల్లా ప్రకారం, పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థలో అనేక క్షిపణి వ్యవస్థలను చేర్చింది, వాటిలో చైనా తయారు చేసిన హెచ్‌క్యూ9, సహా -16 ఎఫ్‌ఈ రక్షణ వ్యవస్థ కూడా ఉంది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, యుద్ధనౌకలకు అడ్డగిస్తుంది. కాగా, గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే మిసైల్స్‌ను అడ్డగించే విషయానికొస్తే.. ప్రస్తుతం అలాంటి రక్షణ వ్యవస్థ అందుబాటులో లేదు. ఇదే సమయంలో, భారత్ మిసైల్స్‌ను గగనతలం నుంచి ప్రయోగించిందా? లేదా భూమి నుంచి ప్రయోగించిందా అనేది తెలియదు. ప్రపంచంలోని ఏ డిఫెన్స్ సిస్టం కూడా ఖచ్చితమైన రక్షణను అందించదని, ముఖ్యంగా ఇరుగు పొరుగున ఉన్న భారత్, పాకిస్తాన్ వంటి దేశాల విషయంలో కష్టమని మాజీ ఎయిర్ కమెడోర్ ఆదిల్ సుల్తాన్ తో అన్నారు. గగనతలం నుంచి భూమికి మిసైల్ దాడులను 100 శాతం ఆపడం అసాధ్యమని ఆయన అంటున్నారు.
హైస్పీడ్ క్షిపణులతో అలజడి
భారత్ ఈ మిసైల్స్‌ను గగనతలం నుంచి భూమికి ప్రయోగించి ఉండవచ్చని ఇక్రముల్లా అభిప్రాయపడ్డారు. వాటి వేగం మాక్ 3 (గంటకు 3,675 కి.మీ) నుంచి మాక్ 9 (గంటకు 11,025 కి.మీ) వరకు మారింది. అమెరికా, రష్యా లేదా చైనాతో సహా ఏ దేశానికీ అలాంటి హై-స్పీడ్ క్షిపణిని అడ్డగించే సామర్థ్యం లేదని ఇక్రముల్లా అన్నారు. గగనతలం నుంచి ప్రయోగించే మిసైల్ ప్రయాణ వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. వాటిని అడ్డగించడానికి చాలా తక్కువ సమయమే దొరుకుతుంది అని ఇక్రముల్లా అన్నారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిసైల్ అడ్డుకోవచ్చు ఎందుకంటే, వాటి ప్రయాణ వ్యవధి ఎక్కువ అని ఆయన వివరించారు. ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థ కూడా 100 శాతం దాడులను నిరోధించలేదని ఆదిల్ సుల్తాన్ అభిప్రాయపడ్డారు. వేర్వేరు దిశల నుంచి గగనతలం నుంచి భూమికి ఒకేసారి మిసైల్స్ ప్రయోగిస్తే, వాటిని రాడార్‌లో గుర్తించడం, వెంటనే స్పందించడం కష్టమని అన్నారు.
ఇప్పుడు భారత్ బాహుబలి
రష్యా ఎస్ -400లు, ఇజ్రాయెల్ వ్యవస్థలతో స్వదేశీ ఆకాష్ క్షిపణులను అనుసంధానం చేయటంతో భారతదేశం ఒక ఉన్నత బహుళ-స్థాయి వాయు రక్షణ వ్యవస్థను కలిగి ఉందని తెలుస్తోంది. ఎస్ -400, దాని విస్తృత శ్రేణి అధునాతన సామర్థ్యాలతో, పాకిస్తాన్ చేతిలోని చైనీస్ హెచ్ క్యూ 9ని బలహీన పర్చింది. సైనిక పౌర రాడార్‌ల ఏకీకరణతో భారతదేశం తన రక్షణను మరింత పటిష్టపర్చింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే రష్యా, ఇజ్రాయెల్ క్షిపణి వ్యవస్థలతో స్వదేశీ ఆకాష్ అనుసంధానంతో కూడిన రక్షణ వ్యవస్థ కలిగిన భారత్ బహుళస్థాయి వ్యవస్థ పాకిస్తాన్ కంటే అధిగమించింది. ఎస్ -400 ‘ట్రయమ్ సర్ఫేస్- టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థతో భారత వైమానిక రక్షణ ఆయుధాలు 380 కిలోమీటర్ల పరిధిలో శత్రు వ్యూహాత్మక బాంబర్‌లు, జెట్‌లు, గూఢచారి విమానాలు, క్షిపణులు, డ్రోన్‌లను గుర్తించి నాశనం చేస్తాయి.
పాకిస్తాన్ రక్షణరంగం ఫెయిల్
పాకిస్థాన్‌కు చైనా సరఫరా చేసిన హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి బ్యాటరీలు రాడార్‌లు 120కిలోమీటర్ల పరిధినే కలిగి ఉంటాయి, ఇవి తాజాగా 300 కిలోమీటర్లకు విస్తరించి ఉన్నాయి. పాకిస్తాన్‌కు ఇవే ప్రధానమైనవి. ఇది ఇతర వ్యవస్థలతో పాటు ఎయిర్‌బేస్‌లు ఇతర ముఖ్యమైన సౌకర్యాల రక్షణ కోసం 20-25కిమీ పరిధితో స్పాడా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కానీ, భారత్ చేతిలోని ఎస్ – 400 తన పరిధిలోని 120, 200, 250, 380 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే నాలుగు రకాల క్షిపణులను కలిగి ఉంది. ఈ స్థితిలో హెచ్ క్యూ – 9 శక్తి చాలటం లేదు. 400 ఎస్ భారత వైమానిక రక్షణ కవరేజీకి చాలా కీలకం.
సొంత క్షిపణులూ సిద్ధం..
భారతదేశం తన సొంత దీర్ఘ-శ్రేణి ఉపరితలం నుంచి గగనతల క్షిపణి (ఎల్ఆర్ ఎస్ ఏఎం వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కుషా కింద భారత్ తన సొంత సుదూర ఉపరితల వాయు క్షిపణి (ఎల్ఆర్ ఎస్ ఏఎం) వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. సుమారు 350 కిమీల పరిధితో, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను 2028-29 నాటికి సిద్ధం చేస్తోంది. ఆర్మీ, నేవీ, వైమానిక దళం అన్ని శక్తివంతమైన బరాక్ -8 మధ్యస్థ శ్రేణి ఉపరితల నుంచి ఎయిర్ క్షిపణి (ఎంఆర్ఎస్ఏఎం) వ్యవస్థలను ప్రవేశపెట్టాయి, 70 కి.మీ కంటే ఎక్కువ పరిధితో, ఇజ్రాయెల్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేసింది.
ఇతర దేశాలకు సప్లయ్ చేసేలా..
సైన్యం, భారత వాయుదళం కూడా స్వదేశీ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను పెద్ద సంఖ్యలో చేర్చాయి. 25 కిమీల పరిధిని కలిగి ఉంది. ఇది ఇప్పుడు ఇతర దేశాలకూ భారత్ ఎగుమతి చేస్తోంది. సాయుధ దళాలు కూడా వివిధ రకాల తక్కువ శ్రేణి వైమానిక రక్షణ ఆయుధాలను కలిగి ఉన్నాయి. వీటిలో పాత రష్యన్ ఇగ్లా -1ఎం (5కిమీ), ఓఎస్ఏఏకేఎం (10కిమీ) పెచోరా క్షిపణులు, అప్‌గ్రేడ్ చేసిన ఎల్ -70 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు (3.5 కిమీ) ఉన్నాయి. కొత్తవి ఇజ్రాయెలీ తక్కువ-స్థాయి స్పైడర్ క్విక్ -రియాక్షన్ యాంటీ -ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు (15 కిమీ పరిధి) రష్యన్ మ్యాన్ -పోర్టబుల్ ఇగ్లా-ఎస్ (6 కిమీ) సిస్టమ్‌లు. డీఆర్డీవో స్వదేశీ అతి స్వల్ప-శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ( వీఎస్హెచ్ఓఆర్ఏడీఎస్) క్షిపణులను కూడా పరీక్షిస్తోంది,

