INS Vikranth – రంగంలో విక్రాంత్ – కరాచీ, ఒర్మారా నావికా స్థావరాలు ధ్వంసం

న్యూ ఢిల్లీ|భారత వైమానిక దళం తరువాత, ఇప్పుడు నావికాదళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీతోపాటు ఒర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత్ నావికా దళం.

రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీని కారణంగా రెండు ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా, రెండు ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. ప్రజలు భయాందోళనలతో తీర ప్రాంతాలను వదిలి బంకర్ల లోపలికి పరుగులు తీస్తున్నారు.

పాకిస్తాన్ నావికాదళానికి కరాచీ, ఒర్మారాలో స్థావరాలు ఉన్నాయి. వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు మోహరించిన చోటు ఇదే.

ప్రస్తుతం INS విక్రాంత్

ఈ రెండు నావికా స్థావరాలను ధ్వంసం చేసేందుకు క్షిపణుల దాడిని ఉధృతం చేసింది. ఇప్పటి ఈ రెండు పోర్టు లో 60 శాతం నాశనమైనట్లు సమాచారం..

Leave a Reply