Nandyala | రైలు కిందపడి యువకుడు మృతి…

నంద్యాల బ్యూరో, మే 8 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె రైల్వే స్టేషన్ వద్ద గురువారం గుర్తు తెలియని యువకుడు గూడ్స్ రైలు కింద పడి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గాజులపల్లి స్టేషన్ సమీపంలో వచ్చే గూడ్స్ కింద ప‌డి యువకుడు మృతి చెందాడు. తల, మొండెం, శరీరం వేరువేరుగా పడిపోయాయి.

గాజులపల్లె రైల్వే స్టేషన్ సిబ్బంది నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. నంద్యాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతిచెందిన యువకుడి వివరాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply