83. పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌగిరిసుతే
నిషంగౌజంఘే తే విషమ విశిఖోబాఢమకృత
యదగ్రేదృశ్యంతే దశ శరఫలాఃపాదయుగళీ
నఖాగ్రఛద్మానస్ఫురమకుటశాణైకనిశితాః.
తాత్పర్యం: కొండలరేడుకూతురా! శివుణ్ణి ఓడించటానికి పంచశరుడైన మన్మథుడు తన దగ్గర ఉన్న ఐదు బాణాలు చాలవు అని వాటిని రెట్టింపు చేయటం అనే నెపంతో నీపిక్కలనుఅమ్ములపొదులుగాను, రెండు కాలివ్రేళ్ళను కలిపి పదిబాణాలుగాను, ఇంద్రాది దేవతలు నమస్కరించి నప్పుడు వారి కిరీటాలలో ఉన్న రత్నాల రాపిడి చేత సానపెట్టబడిన నీ పాదముల వ్రేళ్ళగోళ్లను ఆ బాణాలకి ములుకులుగానుచేసికొన్నాడన్నది నిజం. ( లేదా తన అమ్ములపొదులు బాణాలు ఆ విధంగా అంటే అమ్మవారి పిక్కలుగా, కాలి వ్రేళ్ళుగాకనపడేట్టు చేశాడు అన్నది నిజం.)
- డాక్టర్ అనంతలక్ష్మి