ఆయా దేవతల ప్రభావాన్ని స్వరూపాన్ని అనుగ్రహాన్ని తెలిపేవి మంత్రాలు. అనగా అక్షర రూపాలు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. ‘రా’ అనేది అగ్ని బీజము. ‘లా’ అనేది పృథ్వీ బీజము. ‘హ’ అనేది ఆకాశ బీజము. ఇలా ఆ స్వరూపాలైన దేవతలకు కూడా ఆ బీజాక్షరాలను కలుపుకుని మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలను జపం చేయడానికి ఒక నియమ వ్యవస్థ ఉంది. దాన్ని పాటించినప్పుడే ఆ దైవం అనుగ్రహిస్తుంది.
నియమం తప్పితే మంత్రం వికటిస్తుంది. మన పెదవుల కదలికలో అనగా పెదవులు వేరు చేయుట, పెదవులు దగ్గరగా చేర్చుటలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ‘రా’ అంటే పెదవులు దూరమవుతాయి, ‘మా’ అంటే కలుస్తాయి. అలా ఒకసారి దూరం చేసి మరోసారి కలిపితే ఒక అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది, అదే రామ. ‘కృష్ణ’ అన్నప్పుడు నాలుక అంగిటి భాగాన తగులుతుంది. పెదవులు కలవవు. పెదవులను కలిపి దూరం చేసే మంత్రం ఒకటి, పెదవుల స్పర్శతో సంబంధంలేని మంత్రం ఒకటి. మన జీవితంలో కూడా పెదవులతో పని ఉన్నవి, లేనివి అని రెండు భాగాలుగా ఉంటాయి. అందుకే రామ, కృష్ణ ఈ రెండు మంత్రాలు జీవితానికి ప్రతిబింబాలు.
మంత్రానికి నిర్వచనం ఏమిటి?
