WGL | చెల్పూర్ కు మహార్దశ.. రూ.5కోట్లతో మోడ్రన్ బస్టాండ్ : ఎమ్మెల్యే గండ్ర‌

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి /గణపురం, మే 3(ఆంధ్రప్రభ ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీలో నూతన బస్టాండ్ కు త్వరలో మోక్షం లభించనుందని, రూ.5కోట్ల‌తో మోడ్ర‌న్ బ‌స్టాండ్ ఏర్పాటు కానుంద‌ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న చెల్పూర్ ప్రజల సమస్య దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక దృష్టి సారించారు. దీనితో జెన్కో సౌజన్యంతో నూతన బస్టాండ్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు శనివారం కేటీపీపీ సీఈ ప్రకాష్ తో స్థల పరిశీలన చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… రెండు ఎకరాల్లో మోడ్రన్ బస్ స్టాప్ నిర్మించేందుకు సీఎండీ ఆఫీసుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు రిప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. బస్టాండ్ కు రెండు ఎకరాలు కేటాయించాల్సిందిగా కోరడం జరిగిందని గత మూడు నెలల క్రితమే జెన్కొ నుండి రూ.5కోట్ల సిఎస్సార్ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. టెండర్లు పూర్తిచేసి 60 గుంటల్లో బస్టాండ్ నిర్మాణానికి శిలాఫలకం వేసి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు వారు తెలిపారు.

బస్టాండ్ నిర్మాణానికి డబ్బులు తక్కువ పడితే తన నిధుల నుండి కేటాయించి మోడ్రన్ బస్టాండ్ నిర్మించడం జరుగుతుందన్నారు. జెన్కో యాజమాన్యానికి ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమురయ్య, నాయకులు కొత్త వెంకన్న, లక్కం రాములు, కావటి రవి, సూరినేని సంపత్ రావు, పిన్నింటి మాధవరావు, కాల్వ రాంరెడ్డి, తోట సంతోష్, జకినపెళ్లి బిక్షపతి, నాగరాజు, బీరెల్లి నరేష్ కంచర్ల కుమార్, కార్యదర్శి ముక్కెర హేమంత్ గౌడ్, కారోబార్ వేణు, జెన్కో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *