Amaravati Tour | గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ప్ర‌ధాని మోడీ ల్యాండెడ్

అమరావతి: ప్రధాని మోదీ కేర‌ళ నుంచి ప్ర‌త్యేక విమానంలో గన్నవరం ఎయిర్ట్ కు చేరుకున్నారు.. విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు ఈ సందర్భంగా ప్రధానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి బ‌య‌లు దేరి వెళ్లారు. అక్కడ హెలిపాడ్ మోబాకి గవర్నర్‌ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.

ఇక ఏపీ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఇది షెడ్యూల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు రాజధాని అమరావతి పున: ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన‌నున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిపాడ్‌కు పీఎం చేరుకుంటారు. హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు.

మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు.

మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్ట్ ల ఇవే ..

మోదీ పర్యటన దృష్ట్యా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనలో లోటు పాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమరావతిలో చేపట్టే ₹49,040 కోట్ల పనులకు మోదీ నేటి సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలు, ఆలిండియా సర్వీసెస్‌ అధికారుల బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

డీఆడ్​డీవో పరిశోధనా కేంద్రం..

రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో), డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వే శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన ఏర్పాట్లు చేశారు. వీటి నిర్మాణానికి ₹57,962 కోట్లు ఖర్చు చేయనున్నారు. నాగాయలంకలోని గుల్లలమోద దగ్గర ₹1,500 కోట్లతో మిస్సైల్‌ టెస్ట్‌ రేంజ్‌ సెంటర్‌ నిర్మాణానికి వర్చువల్‌గా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

రైల్వే లైన్లకు ప్రారంభోత్సవం..

విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్‌కు కూడా శంకుస్థాపన చే స్తారు. అలాగే, ₹293 కోట్ల వ్యయంతో గుంతకల్లు వెస్ట్‌ నుంచి మల్లప్పగేటు వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు, ₹3,176 కోట్లతో నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ₹3,680 కోట్ల విలువైన పలు నేషనల్‌ హైవే పనులను ప్రారంభిస్తారు. ₹254 కోట్లతో పూర్తిచేసిన ఖాజీపేట-విజయవాడ 3వ లైన్‌ను, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులో బుగ్గనపల్లి, పాణ్యం రైల్వేలైన్లకు కూడా మోదీ ప్రారంభిస్తారు. అనంత‌రం ఇక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ ప్రసంగించనున్నారు.

Leave a Reply