TG | సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కేఎస్‌ శ్రీనివాసరాజు…

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ శ్రీనివాస్‌ రాజు నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్‌ రాజు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.

కాగా, శ్రీనివాస్‌ రాజు ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన అధికారి. గతంలో టీటీడీ జేఈఓగా శ్రీనివాస్‌ రాజు పని చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటేషన్‌పై రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పదవీ విరమణ పొందిన ఐఏఎస్‌ అధికారి శ్రీనివాస్‌ రాజు తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ సలహాదారుగా నియామకమైన విషయం తెలిసిందే.

ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎస్డీగా కమలాసన్‌రెడ్డి

ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా, డ్రగ్‌ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌గా పనిచేసిన కమలాసన్‌రెడ్డి పదవీ విరమణ చేశారు. ఆయనను ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎస్డీగా పునర్నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

Leave a Reply