New Delhi | ఉభయ సభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి … మోడీకి రాహుల్, ఖర్గే ల లేఖ

న్యూ ఢిల్లీ – అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ప్రధాని మంత్రి మోడీకి విడివిడిగా లేఖలు రాశారు.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని ప్రపంచానికి మరోసారి చూపించాల్సిన అవసరం ఏర్పడిదన్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత పార్లమెంటు సాక్షిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని లేఖలో తెలిపారు.


