Telangana |డీజీపీ రేసులో 8 మంది

హైదరాబాద్ – తెలంగాణ డిజిపి జితేందర్ త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో కొత్త డిజిపి ఎంపికకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంబించింది. దీనికోసం ఎనిమిది మంది సీనియర్ ఐపిఎస్ అధికారులతో కూడిన జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపింది.

పంపిన జాబితాలో రవి గుప్తా (1990 బ్యాచ్), సీవీ ఆనంద్ (1991 బ్యాచ్), డా. జితేందర్ (1992 బ్యాచ్), ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్), కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్), బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్), డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్), శిఖా గోయల్ (1994 బ్యాచ్) ఉన్నారు.. ఇక రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లలో అర్హతల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లును సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది యూపీఎస్సీ. దీని అధారంగా ఒకరిని రాష్ర్ట ప్రభుత్వం ఎంపిక చేసుకుంటుంది.ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు.

డిజిపి రేస్ లో ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 5న, రవి గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న , సీవీ ఆనంద్ 2028 జూన్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్, బి. శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28, డా. సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30, శిఖాగోయల్ 2029 మార్చి వరకు సర్వీస్ లు కొనసాగనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *