Medical | హీమోఫిలియా బాధితులు భారత్ లోనే ఎక్కువ : డాక్టర్ విక్రమ్‌ కుమార్

హైదరాబాద్ – ప్రపంచంలో ఇండియాలోనే హీమోఫిలియా బాధితులు ఎక్కువ మంది ఉన్నారని ప్రముఖ హీమోటలాజీ వైద్య నిపుణులు విక్రమ్‌ కుమార్ వెల్లడించారు. ఇతర దేశాల్లో కంటే భారత్‌లోనే హీమోఫిలియా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు. వరల్డ్‌ హీమెఫిలియా డే ను పురస్కరించుకుని రాజ్‌భవన్‌ రోడ్‌లోని అశ్విన్ హాస్పిటల్‌ లో హీమోఫిలియా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కార్యక్రమంతోపాటుగా అదే విధంగా ఇదే హాస్పిటల్‌లో వ్యాధి బాధితులకు ఉచిత సేవలందించేందుకు ఏర్పాటు చేసిన హీమోఫిలియా ట్రిట్‌ మెంట్ సెంటర్‌ కు ఏడాది పూర్తైన సందర్భంగా వ్యాధిగ్రస్తులకు తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్‌ నిర్వాహకులు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తున్నప్పటికీ బాధితులు పెరుగుతున్నారని…పూర్తిగా వ్యాధి నయం కాకుండా ఉపశమనం కలిగేందుకు అధునిక వైద్య చికిత్స మందులు అందుబాటులోకి వస్తున్నాయని విక్రమ్‌ కుమార్ తెలిపారు. శరీరంలో అంతర్గత రక్తస్రావం జరిగినప్పుడు ఫ్యాక్టర్‌ ఇంజిక్షన్‌తోపాటు రక్తస్రావం అవుతున్న ప్రదేశంలో ఐస్ పెడుతూ ఉండాలన్నారు. అలాగే ఫిజియోథెరిపి చేయించుకోవాలని సూచించారు. హీమోఫిలియా బాధితులకు ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు అశ్విని హాస్పిటల్‌ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సీతాదేవి తెలిపారు.

బాధితులు ఎప్పుడూ వచ్చిన వైద్యం అందించేందుకు సిద్దంగా ఉంటామని సీతాదేవి వివరించారు. తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు సుమారు 25మంది బాధితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వినీ హాస్పిటల్‌ వైద్యులు రమణి, తపాడియా డయాగ్నిస్టిక్ సెంటర్ ఎండీ రాధేశ్యామ్‌ తపాడియా, హీమోఫిలియా హైదరాబాద్ చాప్టర్ ఉపాధ్యక్షులు హేమంత్ కుమార్, అబ్దుల్ రజాక్, జాయింట్ సెక్రటరీ వంశీ, రామారావు, వాసు, దీపిక, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply