జన్నారం, ( ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొమ్ముగూడ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలానికి చెందిన ఫిజియోథెరపీ వైద్యుడు ఉర్మెత జంగుబాబు (30) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఒక వివాహ కార్యక్రమానికి హాజరై.. కలమడుగు నుంచి జన్నారం వైపు వస్తున్న జంగుబాబు… ఇందనపల్లి గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఫిజియోథెరపీ వైద్యుడు జంగు బాబు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారని స్థానిక సబ్-ఇన్‌స్పెక్టర్ గుండేటి రాజవర్ధన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.