Top Story | ప్ర‌కృతి ప్ర‌సాదం…ఆరోగ్యానికి వ‌రం : నోరూరించే తాటి ముంజులు

ప్ర‌పంచీక‌ర‌ణ‌ .. కార్పొరేట‌రీక‌ర‌ణ‌తో ప్ర‌కృతి ప్ర‌సాదించే ప్ర‌తి ఫ‌లంలోనూ క‌ల్తీ చోటు చేసుకుంటుంది. కానీ తాటి ముంజ‌లు స్వ‌చ్ఛ‌తే సొంతం చేసుకుంది. మ‌న‌కు ప్ర‌కృతి ఇచ్చే పండ్లు, కాయ‌లు ఎన్నో క‌ల్తీల‌తో మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. కొబ్బ‌రి, మామిడి, సీతాఫ‌లం, జామి, ద్రాక్ష ఇలా అన్నింటికి ర‌సాయ‌నాలు, ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. వాటిపై కార్పొరేట్ దృష్టి ప‌డిన త‌ర్వాత స్వ‌చ్ఛమైనవి ల‌భించ‌డం లేదు. కొన్ని విష‌పూరితంగా మారుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు. కానీ ఇప్ప‌టికీ తాటి ముంజులు స్వ‌చ్ఛంగానే ల‌భిస్తున్నాయి. దీంతో ఆరోగ్య ప్ర‌దాత‌గా విర‌జిల్లుతున్నాయి. వేస‌వి కాలంలో ల‌భించే ఇవి ఎండ‌లు, ఉష్ణోగ్ర‌త‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నాయి. ఒక‌ప్పుడు వీటి అమ్మ‌కాల‌కు గ్రామీణ ప్రాంతాల‌కే ప‌రిమితం. ఇప్పుడు వీటికి హైద‌రాబాద్‌లోనూ గిరాకీ ఉంది.

కమాన్‌ పూర్‌, ( ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా), ఆంధ్రప్రభ : కల్తీ లేనివి మందులు వాడనివి కేవలం తాటికాయలే.. వేసవి వచ్చిందంటే చాలు తాటి చెట్లకు కాయలు విరివిగా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ తినాలనే తాపత్రయం ప‌డుతుంటారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండే తాటి ముంజులు ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో సైతం లభ్యమవుతున్నాయి. హైద‌రాబాద్ న‌డిబొడ్డులో కూడా వీటి విక్ర‌యాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం తాటి ముంజలు విక్రయిస్తున్నారు. ఏ కాలమైనా పెద్దగా ఇబ్బందులుండవు కానీ, వేసవి కాలం వచ్చిందంటే వేసవి తాపానికి భయవడతాం. ఓవైపు భానుడు భగభగ.. మరోవైపు రోడ్లన్నీ నిప్పుల కుంపటిని తలపించేలా సుర్రుమంటాయి. ఇళ్లలో నీడపట్టున కూర్చున్నా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. కాలానికి తగ్గట్టు కమ్మని రుచులను వెంటబెట్టుకు వచ్చే తాటి ముంజలను తింటూ వేస‌వితాపం నుంచి ఉప‌శ‌మనం పొందుతున్నారు.

తాటి ముంజ మజాయే వేరు..
వేసవిలో ఎన్ని పళ్లు తిన్నా.. శీతల పానీయాలున్నా.. తాటి ముంజల మజాయే వేరుగా ఉంటుంది. వీటికి ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. తాటి ముంజల ధర కూడా ఏమంత తక్కువ కాదు.. పట్టణ ప్రాంతాల్లో చాలా బాగా డిమాండ్‌ ఉంది. ఆరోగ్యాన్ని అందించడంలో కూడా తాటి ముంజలు ముందుంటాయి. వేసవిలో మాత్రమే లభించే వీటిని సిప్‌ చేయకుండా ప్రతి ఒక్కరూ తినాలనుకుంటారు. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పట్టణ ప్రాంతాల్లో తాటి ముంజలకు డిమాండ్‌ బాగా పెరిగింది. వేసవిలో మాత్రమే లభించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేయడంతో తాటిముంజలను కొనుగోలు చేయడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.

ఎన్నో లాభాలు…
అమ్మకం దారులు రోడ్డు పక్కనే కూర్చుని అమ్మడం మొదలు పెట్టిన గంటల వ్యవధిలోనే అమ్ముడు పోతున్నాయి. ప్ర‌స్తుతం న‌గ‌ర‌ల్లో ఒక ముంజ ప‌ది రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. తాటి ముంజల్లో విటమిన్‌ బి7, విటమిన్‌ , సోదెలుర్‌ ఫైబర్‌, పొటాషియం, కాల్షియం విసిమిన్‌- ఎ, ఎమిన్‌-డి విటమిన్‌- జింక్‌, ఐరన్‌ లతో పాటు న్యూట్రిన్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. వేసవికాలంలో శరీరంలోని లవణ పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో డీహైడ్రేషన్‌ ఏర్పడి జనం అస్వస్థతకు గురవుతారు. అందుకే ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. వేసవిలో శరీరానికి నీరు ఒక్కటే సరిపోదు. ఎన్నో రకాల జ్యూస్‌లు, పండ్లు తినాల్ని వస్తుంది. తాటి ముంజలు ఉంటే చాలు ఎంతటి ఎండ తీవ్రతకైనా అలసిపోకుండా యాక్టివ్‌ గా ఉంటారు. తాటి ముంజల్లో శరీరానికి అవసరమయ్యే మినరల్స్‌, షుగర్స్‌ ఉంటాయి. ఇవి శరీరాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతాయి.
శరీరానికి చల్లదనాన్ని అందించడంలో అద్భుతంగా సహాయపడతాయి. వేసవి వల్ల ఒంట్లో పెరిగే వేడిని అమాంతం తగ్గించడంలో తాటి ముంజలు ముందుంటాయి. తాటి ముంజల్లో ట్యూమర్లను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కణాలను డెవలప్‌ చేసే ఫైటోకెమికల్స్‌ అంథోసాయనిన్లను నిర్మూలిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు. తాటి ముంజల్లో విటమిన్లు, మినరల్స్‌, ఐరన్‌, జింక్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

అనేక రుగ్మతలకు చెక్‌
నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువుకు చెక్‌ పెట్టవచ్చు. తాటి ముంజల్లో పొటాషియం ఎక్కువగా ఉండడంతో రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. పొటాషియం శరీరంలో ఉండే వ్యర్థాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. కిడ్నీ లివర్‌ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు తాటి ముంజెలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో వచ్చే వేడి వల్ల విరోచనాల సమస్య వస్తూ ఉంటుంది. తాటి ముంజలు తీసుకోవడం వల్ల సమస్యను పరిష్కరించవచ్చు. కడుపు ఉబ్బరం, కడుపులో వికారం, కడుపు నొప్పి, జీర్ణాశయ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. గర్భవతులకు కలిగే కండరాల తిమ్మిర్లు, అలసట తగ్గించడంలో తాటి ముంజలు బాగా సహాయపడతాయి. శరీరానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో మన శరీరం నుండి చెమట బయటకు పోతుంది. శరీరంలోని పోషకాలు చెమట రూపంలో బయటకు పోతాయి. వాటిని భర్తీ చేయడానికి తాటి ముంజలు ఎంతో అవసరం.

చ‌లువ కోసం…
తాటి ముంజ‌లో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే!

నిర్జలీకరణం నుంచి ఉపశమనం..
ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా నిర్జలీకరణ అయిపోవడం సర్వసాధారణం. కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు ఆకారంలో లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.

గర్భిణులకూ మంచిదే..
గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి.

బరువునూ తగ్గిస్తాయి
తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. అలాగే చికెన్‌పాక్స్‌తో బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

విషపదార్థాలు మాయం..
తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది.

వాంతులయ్యేలా ఉంటే..
అధిక ఎండ వేడిమికి కొంతమందికి ఒక్కోసారి వాంతులయ్యేట్లు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు నిమ్మరసం తాగుతారు. ఒకవేళ నిమ్మరసంతో ఎలాంటి ఫలితం లేకపోతే తాటి ముంజలు తినడం మంచిది. వెంటనే ఆ సెన్సేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవిలో అలా కాసేపు బయటికి వెళ్లొస్తేనే అలసిపోతాం కదా! అంతేకాదు.. విపరీతమైన చెమట పోస్తుంది.. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని అందించి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఒక సులువైన మార్గం తాటి ముంజల్ని తినడం..

క్యాన్సర్ల నుంచి..
తాటి ముంజలు.. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. కాబట్టి ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *