లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ – లక్నో సూపర్ జట్లు తలపడనున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సొంత మైదానంలో లక్నో జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టనుంది. కాగా, ఐపీఎల్ టోర్నీల్లో డీసీ – ఎల్ఎస్ జి ఇరు జట్లు ముఖాముఖి పోరులో 6 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 6 మ్యాచ్‌ల్లో డీసీ జట్టు 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఎల్ఎస్ జి జట్టు 3 సార్లు గెలిచింది. సమవుజ్జీలుగా ఉన్న ఢిల్లీ – లక్నో జట్లు.. ప్రస్తుతం 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో టాప్ 5లో ఉన్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య నేడు హోరాహోరీ పోరు జరగనుంది.
జట్టు మార్పులు:
ఢిల్లీ క్యాపిటల్స్: మోహిత్ శర్మ స్థానంలో దుష్మంత చమీరా తుది జట్లులోకి వచ్చాడు. 2022, 2024లో లక్నో, కోల్‌కతా తరపున ఆడిన దుష్మంత చమీర నేటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున అరంగేట్రం చేయనున్నాడు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.
లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ :
ఢిల్లీ : జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, డోనోవన్ ఫెరీరా, సమీర్ రిజ్వీ, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్.
లక్నో : మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్, ఆయుష్ బడోని, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్