52. వారిజాక్షులందు వైవాహికములందు
బొంకినట్టి చరిత పొందినావు
మనిషిగుణములన్ని గనియయ్యె నీయందు
గీతదాత నీకు కేలుమోడ్తు
53. లాస్యమందునైన హాస్యమందైనను
కొమ్ములును తిరిగెడు కోవిదుడవు
నీకు సాటి ఎవడు? నీకు పోటీ ఎవడు?
గీతదాత నీకు కేలుమోడ్తు
54. తప్పుచేయుటెట్లు? తప్పించుకొనుటెట్లు?
జనులకిదియు నొకటె సంశయమ్ము
ఆదిగురువు నీవె అడుగుజాడవు నీవె
గీతదాత నీకు కేలుమోడ్తు