స్వామీజీలు ఎవరు దేవాలయంలోకి పాదుకలతో వెళ్ళరు. అలా వెళ్ళిన వారు స్వామీజీలు కారు. అన్నిరకాల దుమ్ము, దూళితోపాటు క్రిమి కీటకాలు పాదరక్షలలో చేరుతూ ఉంటాయి. కావున పాదరక్షలతో దేవాలయంలోనికి వెళ్ళరాదు. మనిషి సృష్టించిన ఆధునిక యంత్రాలు ఉన్న గదిలోకి పాదరక్షలతో వెళ్ళని మనము మనిషిని సృష్టించిన దేవుని గుడిలోకి పాదరక్షలతో వెళ్ళడం సమంజసం కాదు. గర్భగుడిలోనికి అర్చకుడు తప్పు మరెవరు వెళ్ళరాదు. అర్చకుడు కూడా భక్తులను తాకరాదు. తీర్థం, ప్రసాదం పైనుంచే వేయాలి
భక్తులను తాకితే భక్తుల వెంట ఉన్న అన్ని దోషాలు అర్చకుడి ద్వారా స్వామికి అంటుతాయి. మనం ప్రతిష్టించిన స్వామికి మంత్రాలతో శక్తిని చేరుస్తున్నాము, కళా వాహనతో ప్రభావాన్ని చేరుస్తున్నాము కావున స్వామి దగ్గర కల్తీలు పనికిరావు. దేవాలయాలలో ఆధార వ్యవహారాలు పాటించకుంటే భక్తులకి ఆనర్ధం.
స్వామీజీలు పాదరక్షలతో దేవాలయంలోకి వెళ్ళవచ్చా?
