వర్తమాన సమయంలో ఆత్మకు కావలసిన శక్తి. జనన, మరణ చక్ర ప్రయాణంలో ఎంతో చెత్తను ప్రోగు చేసుకుని, ఆత్మ ఎంతో భారంగా, అసం పూర్ణంగా అయింది. కాబట్టి ఆత్మ తన శక్తికి తగ్గట్టుగా వ్యవహరించలేకపోతుంది. ఆత్మలోని సామర్థ్యాలను సరైన విధంగా ఉపయోగిస్తూ, భగవంతుని సాన్నిధ్యం ఉంటూ గమ్యాన్ని చేరుకున్నప్పుడు ఆత్మ తను పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందుతుంది. మనసు సాధారణమైన, వ్యర్థమైన, స్వార్థ చింతనతో ఉన్నప్పుడు అది సమయము మరియు శక్తులను వ్యర్థపరుచుకున్నట్లే. ఈ విధంగా ఆలోచనలను, మాటలను, శ్వాసను వ్యర్థంగా ఉపయోగించిన కారణంగా ఆత్మ సరైన మార్గాన్ని, భగవంతుడిని వదిలిపెట్టేస్తుంది. ఇతరులను నిందించడము, ఫిర్యాదు చెయ్యడము కేవలం సాకులు చెప్పడం మాత్రమే. ఇది మరో పెద్ద తప్పు, దీని వలన ఎంతో శక్తి వ్యర్థమై మరెంతో శక్తి వృధాగా పోతుంది.
ఇలా ప్రవర్తించేందుకు ఇంక సమయము లేదు. నీకు శక్తి కావాలి అన్న సంగతిని అర్థం చేసుకుని దానిని పెంపొందించుకో. శక్తి పెరుగుతున్న కొద్దీ ప్రేమ కూడా పెరుగుతుంది.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి