కోల్ కతా – పశ్చిమబెంగాల్ ఉపాధ్యాయులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీపికబురు చెప్పింది. కొత్తగా ఉద్యోగుల్ని నియమించేంత వరకు ఉపాధ్యాయులుగా కొనసాగవచ్చని సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తాజా తీర్పుతో ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం లభించింది. ఇదే సమయంలో కొత్తగా ఉపాధ్యాయులను వారి స్థానంలో నియమించేంది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రకటించేశారు..
ఇది ఇలా ఉంటే ఇటీవల 25 వేల టీచర్ పోస్టుల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో అవకతవకలు జరిగాయని న్యాయస్థానం పేర్కొంది. దీంతో 25 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో బాధితులు రోడ్డుపైకి ఎక్కారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందారు. ఇక ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాను అధికారంలో ఉండగా ఒక్క టీచర్ ను కూడా తొలగించేది లేదంటూ ముఖ్యమంత్రి మమతా అప్పుడే ప్రకటించారు.. ఇక తాజా తీర్పుతో టీచర్లకు కొంత ఉపశమనం లభించింది.