Thorrur | అక్రమంగా తరలిస్తున్న బెల్లం పట్టిక, కారు స్వాధీనం… అదుపులో నిందితుడు

తొర్రూరు టౌన్, ఏప్రిల్ 15 (ఆంధ్రప్రభ) : తొర్రూరు ఎక్సైజ్ పరిధిలో కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గుడుంబా తయారు చేసే బెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సమాచారం మేరకు రూట్ వాచ్ చేస్తుండగా మండలంలోని వెలికట్ట ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా, కారులో గుడుంబాకు వినియోగించే 400కిలోల బెల్లం పట్టికను పట్టుకున్నామని తెలిపారు.

బెల్లాన్ని రవాణా చేస్తున్న చంగల రాజేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను గతంలో కూడా రవాణా చేశానని చెప్పాడన్నారు. 20పెట్టల బెల్లం, రెండు బస్తాల పట్టికను తీసుకువచ్చి తొర్రూరు పరిధిలో గల పడమటి తండా తదితర ప్రాంతాల్లో అక్రమ రవాణా చేస్తున్నాడని, రూ.10 లక్షల విలువైన కారును, బెల్లం, పట్టికని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముడి పదార్థాలను క్రయ విక్రయాలు చేసిన గుడుంబా తయారీకి పాల్పడితే కేసులు తప్పవన్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది యాదగిరి, నితిన్, అనిత్ శంకర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *