ఐపీఎల్ 18వ సీజన్ వేలంలో రికార్డు ధర పలికిన రిషభ్ పంత్(63) అర్ధ శతకంతో మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK)బౌలర్లపై విరుచుకుపడ్డ అతడు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో లక్నోసూపర్ జెయింట్స్‌కు భారీ స్కోర్ అందించాడు. లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది
ఐపీఎల్ 18వ సీజన్ వేలంలో రికార్డు ధర పలికిన రిషభ్ పంత్(63) అర్ధ శతకంతో మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK)బౌలర్లపై విరుచుకుపడ్డ అతడు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో లక్నోసూపర్ జెయింట్స్‌కు భారీ స్కోర్ అందించాడు. ఈ ఎడిషన్‌లో జెయింట్స్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలుస్తున్న మిచెల్ మార్ష్(30), నికోలస్ పూరన్(8)లు విఫలం కాగా.. పంత్ ఒంటరిపోరాటంతో ఆకట్టుకున్నాడు. ఆయుష్ బదొని(22), అబ్దుల్ సమద్(20)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
అయితే.. పథిరన(2-45) ఆఖరి ఓవర్లో కేవలం 10 రన్స్ రావడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది