TG | సీఎం రేవంత్ ను కలిసిన దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులు
- ఫౌండేషన్‌కు సీఎం సూచన
హైదరాబాద్‌లో దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు.., ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్లంలో శిక్షణ, నైపుణ్యాలను పెంచేందుకు తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల విస్తరణకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులు కోరారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులకు పలు సూచనలు చేశారు. కస్తూర్బా పాఠశాలల్లో ఫౌండేషన్ సేవలు అందించాలని.. మహబూబ్‌నగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని దేశ్‌పాండే ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు గురురాజ్ దేశ్‌పాండే, జయశ్రీ దేశ్‌పాండే, రాజు రెడ్డి, జి.అనిల్ తదితరులు పాల్గొన్నారు.