Virat Kohli | రికార్డుల రారాజు.. !

రికార్డుల రారాజు, ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ మ‌రో రికార్డును సృష్టించాడు. ఈరోజు జైపూర్ వేదిక‌గా రాజ‌స్థాన్ తో జ‌రిగిన మ్యాచ్లో మ‌రో మైల్ స్టోన్ చేరుకున్నారు కోహ్లీ. ఆర్ఆర్ పై ఛేజింగ్ లో విరాట్ కోహ్లీ 39 బంతుల్లో 52 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ బాదాడు.

దీంతో కోహ్లీ తన ఖాతాలో 100 హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. ఈ ఘనత సాధించడంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అంతర్జాతీయంగా డేవిడ్ వార్నర్ తర్వాత 100 హాఫ్ సెంచరీలు సాధించిన రెండవ బ్యాట‌ర్ గా విరాట్ నిలిచాడు.

Leave a Reply