ACB | రూ.7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

జగిత్యాల : జగిత్యాల కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్ లోని ట్రెజరీ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రఘు రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ రఘు ఓ వ్యక్తికి శాంక్షన్ చేసిన డబ్బులకు ప్రతిఫలంగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యం వేధింపులకు గురి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *