CSK vs DC | చెన్నైకి చెక్ పెట్టిన ఢిల్లీ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఈరోజు త‌మ హోమ్ గ్రౌండ్ లో జ‌రిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఓటమి పాలైంది. చెన్నై జ‌ట్టును చింబరం స్టేడియంలో ఢీకొన్న ఢిల్లీ.. 25 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించింది. ఈ సీజ‌న్ను విజ‌యంతో ఆరంభించిన చెన్నై.. అదే జోరును మిగితా మ్యాచుల్లో క‌న‌బ‌ర్చ‌లేక‌పోయింది. దీంతో వ‌రుస‌గా మూడు మ్యాచ్ లు ఓడిపోయింది.

మరోవైపు, ఈ సీజన్‌లో సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్.. హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ ఓట‌మితో 8వ స్థానంలో ఉంది.

కాగా, ఈ మ్యాచ్ లో 184 ప‌రుగులు విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై.. ఢిల్లీ ధాటికి 158/5 ప‌రుగుల‌కే పరిమిత‌మైంది. ఈ మ్యాచ్ లో అర్థ శ‌త‌కంతో చెల‌రేగిన‌ విజ‌య్ శంక‌ర్ (54 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సుతో 69* నాటౌట్) చెన్నై తరుఫున‌ టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఇక ధోని (30 నాటౌట్) ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన‌వారు పేవ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ‌ప‌రిచారు.

ఢిల్లీ బౌల‌ర్ల‌లో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు తీయ‌గా.. మిచెల్ స్టార్క్, మ‌హేష్ కుమార్, కుల్దీప్ యాద‌వ్ త‌లా ఒక వికెట్ ద‌క్కించుకున్నారు.

ఇక అంత‌క‌ముందు బ్యాటింగ్ చేప‌ట్ట‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగులు బాదింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సుల‌తో 77) ప‌రుగుల సునామీ సృష్టించాడు. అభిశేక్ పోరేల్ (30), అక్ష‌ర్ ప‌టేల్ (21), స‌మీర్ రిజ్వి (20), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (24 నాటౌట్) రాణించారు.

చెన్నై బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా.. నూర్ అహ్మ‌ద్, మ‌తీశ ప‌తిరాణ ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.

కాగా, ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోటీ నెలకొంది. చెన్నై పై గెలుపొందిన ఢిల్లీ అగ్రస్థానికి చేరుకోగా… మరోవైపు పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ తో తలపడుతొంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే పంబాజ్ జట్టు తిరిగి టాప్ ప్లేస్‌కు చేరుకునే అవకాశం ఉంది.

Leave a Reply