KKR vs SRH | కోల్‌కతాతో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన స‌న్‌రైజర్స్ !!

కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ – సన్‌రైజర్స్ హైద‌రాబ‌ద్ మధ్య ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. గత సీజన్‌లో ఫైనల్స్‌లో ఆడిన కోల్‌కతా, హైదరాబాద్ జ‌ట్లు.. ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయాయి. అయితే, క్యాష్-రిచ్ లీగ్ కొత్త సీజన్‌లో నేటి మ్యాచ్ ఈ రెండు జట్ల భవిష్యత్తును దాదాపుగా నిర్ణయించే అవకాశం ఉంది.

టాస్ అప్డేట్ !

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ఇరు జట్లకు కీలకం..

టోర్నీలో పరాజయాలతో డీలాపడ్డ రెండు జట్లు.. నేటి మ్యాచ్‌లోనే పునరాగమనం చేయాలని పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్ కొత్త సీజన్ ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు తదుపరి మ్యాచ్‌లలో కొంత ఆత్మవిశ్వాసంతో ఆడే అవకాశం ఉంటుంది. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.

ఐపీఎల్ టోర్నీల్లో కెకెఆర్ – ఎస్‌ఆర్‌హెచ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 28 మ్యాచ్‌ల్లో కెకెఆర్ జట్టు 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఎస్‌ఆర్‌హెచ్ జట్టు 9 సార్లు గెలిచింది.

తుది జట్లు :

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.

కోల్‌కతా నైట్ రైడర్స్ : క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.

Leave a Reply