TG | పెరుగులో విషం – ముగ్గురు చిన్నారులు మృతి

అమీన్ పూర్, మార్చి 28 (ఆంధ్రప్రభ):అమీన్‌పూర్‌లోని రఘవేంద్ర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో అవురిజింతల చెన్నయ్య తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి 09 గంటల సమయంలో, రాజిత, పిల్లలు అన్నం, పెరుగు తిన్నారు. అయితే, చెన్నయ్య కేవలం పప్పు అన్నం మాత్రమే తిన్నాడు (పెరుగు తినలేదు). ఆ తర్వాత చెన్నయ్య తన వాటర్ ట్యాంకర్ (ట్రాక్టర్) తో చందానగర్‌కు నీటి సరఫరా కోసం వెళ్లి రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటి వరకు పిల్లలు నిద్రపోతుండగా, అతని భార్య రాజిత తలుపు తెరిచింది.

అయితే, రాత్రి 03 గంటల సమయంలో రాజితకు ఆకస్మికంగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి బిగ్గరగా అరవడం ప్రారంభించింది. వెంటనే చెన్నయ్య పొరుగువారిని పిలిచి, ఆమెను బీరంగూడలోని పానసియా ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది.

అయితే, ఇంటిలో పిల్లలను తనిఖీ చేయగా, ముగ్గురు కూడా అప్పటికే మృతి చెందిపోయారు. శుక్రవారంన తెల్లవారు జామున 02.45 గంటలకు, మూగ్గురు పిల్లలు సాయి కృష్ణ, వయస్సు 12 సంవత్సరాలు, మధుప్రియ, వయస్సు 10 సంవత్సరాలు, గౌతమ్, వయస్సు 8 సంవత్సరాలు, రఘవేంద్ర నగర్ కాలనీలోని తమ ఇంట్లో తెలియని విషపదార్థం సేవించడంతో మృతి చెందినట్లు సమాచారం అందింది.

వారి తల్లి రజిత @ లావణ్య, వృత్తి పాఠశాల టీచర్ అపస్మారక స్థితిలో ఉండగా, ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Leave a Reply