ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది.
పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్.. 8వ ఓవర్లో విధ్యంసకర బ్యాటర్ ట్రావిస్ ఔటయ్యాడు. 47 పరుగుల వద్ద ఉన్న ట్రావిస్ హెడ్… ప్రిన్స్ యాదవ్ వేసిన ఓవర్ లో మూడో బంతికి బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు.
ప్రస్తుతం క్రీజులో నితిష్ కుమార్ రెడ్డి (20) – హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. కాగా, 8 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోర్ 80/3
అంతకముందు ఓపెనర్ అభిషేక్ శర్మ (6)తో పాటు ఇషాన్ కిషన్ (0) ఔటయ్యారు.

