KKR vs RR | బోణీ కొట్టిన కోల్‌కతా… ఆర్ఆర్ పై ఈజీ విన్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ బోణీ కొట్టింది. గౌహతి వేదికగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఈజీ విక్టరీ నమోదు చేసింది. 152 ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేజింగ్ కు దిగిన కోల్‌కతా… 8 వికెట్ల తో రాజ‌స్థాన్ను చిత్తు చేసింది.

కెకెఆర్ విజయంలో డి కాక్ కీలక పాత్ర పోషించాడు. ఈజీ ర‌న్ ఛేజ్ లో క్వింటన్ డి కాక్ ( 61 బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సులతో 97* నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. క్వింటన్ డి కాక్ తో కలిసి అంగ్క్రిష్ రఘువంశీ (17 బంతుల్లో 2ఫోర్లతో 22* నాటౌట్) రాణించాడు. ఇక ఈ విజయంతో కేకేఆర్ కు ఈ సీజన్లో తొలి విజయాం సాధించింది.

కాగా, నేడు గౌహ‌తి వేదిక‌గా జ‌రిగిన మ్యాచ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన రాజ‌స్థాన్.. కోల్ క‌తా బౌల‌ర్ల ధాటికి స్వ‌ల్ప ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ధ్రువ్ జురేల్ (33)తో టాప్ స్కోర‌ర్ గా నిల‌వ‌గా.. మిగిలిన‌ కీల‌క బ్యాట‌ర్లు నిరాశ ప‌ర‌చారు. దీంతో ఆర్ఆర్ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు న‌మోదు చేసింది. స్పెన్సర్ జాన్స‌న్ ఒక వికెట్ తీయ‌గా.. వైభ‌వ్, హ‌ర్షిత్ రాణా, మోయిన్ అలీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రెండేసివికెట్లు ద‌క్కించుకున్నారు.

ఇక‌ రేపు (గురువారం) జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్‌జెయింట్స్ జ‌ట్లు తలపడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *