JC Prabhakar Reddy | ఇండస్ట్రీల జోలికి వస్తే ఊరుకోం..

JC Prabhakar Reddy | ఇండస్ట్రీల జోలికి వస్తే ఊరుకోం..
JC Prabhakar Reddy |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తాడిపత్రి అభివృద్ధికి అడ్డుపడితే తాటతీస్తామని తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రిలోని ఫ్యాక్టరీలపై పలువురు పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
80శాతం ప్రజలు ఫ్యాక్టరీలపై ఆధారపడ్డారన్నారు. పొల్యూషన్ అంటూ ఇండస్ట్రీల జోలికి వస్తే ఊరుకోమన్నారు. 30ఏళ్లుగా లేని కాలుష్యం ఇప్పుడే గుర్తొచ్చిందా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఆదాయం ఉంటే… పొల్యూషన్ గుర్తుకు రాదన్నారు.
ఆదాయం లేకుంటే… కాలుష్యం వెంటాడుతదా..? అన్నారు. కాలుష్యం ఉంటే విల్లాలు ఎలా నిర్మించారని అన్నారు. పరిశ్రమల జోలికి వస్తే తాడిపత్రి జనం తిరగబడతారన్నారు. ఇండస్ట్రీలను ప్రశ్నించే వారి ఇళ్ల ముందు బైఠాయిస్తారన్నారు. పరిశ్రమల రాకతోనే తాడిపత్రి అభివృద్ధి జరిగిందన్నారు.
