వేసవి నీటి ఏద్దడి ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు

ఏడపల్లి, ఆంధ్రప్రభ : జిల్లా జిల్లాలో వేసవి నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.శుక్రవారం ఎడపల్లి మండలం లోని జానకం పేట్ వద్ద ఏర్పాటు చేస్తున్న భూస్టర్ పంపు హౌస్ పనులను పరిశీలించారు. సింగూర్ జాలశయం నుంచి అలీ సాగర్ వరకు నీరు సరఫరా అవుతుంది. ఈ నీటి సరఫరా వేగాన్ని పెంచడo తో పాటు గ్రామాలలో నీటి సరఫరా సకాలo లో అందించేందుకు వీలుగా చర్యలు తోసుకుంటున్నామని అన్నారు. కలెక్టర్ వెంట మిషన్ భగీరథ అధికారులు స్థానిక సర్పంచ్ ఉన్నారు.
