గౌడ సమాజ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటాను..

గౌడ సమాజ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటాను..

  • పండుగ నిర్వహణకు పూర్తి సహకారాలు ఉంటాయి..
  • పండుగ ఆహ్వాన పత్రికను అందజేసిన చాగల్లు గౌడ కులస్తులు..

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : గౌడ సమాజ అభివృద్ధికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో రాబోయే కాటమయ్య పండుగను పురస్కరించుకుని గౌడ కులస్తులు హైదరాబాద్‌లో 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్, 6వ వార్డు కౌన్సిలర్ బాలగాని అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 30న జరిగే కాటమయ్య పండుగకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీకి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాటమయ్య పండుగ గ్రామీణ సంప్రదాయాల ప్రతిబింబమని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధి, పండుగ నిర్వహణకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను. ఈ సందర్బంగా గౌడ సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు రంగు ప్రభాకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు వడ్లకొండ విజయ్ కుమార్, మాచర్ల బిక్షపతి, వడ్లకొండ నర్సయ్య, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచర్ల అశోక్, కమిటీ ఉపాధ్యా క్షులు రంగు అనూప్, కోతి అజయ్ కుమార్, కులస్తులు రంగు యాకయ్య, రంగు వెంకటేష్, మాచర్ల ప్రవీణ్, వడ్లకొండ కిషోర్, బాలగాని నరేష్, బాలగాని అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply