కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు..

కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు..

రణస్థలం, ఆంధ్రప్రభ : రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, భీమా, వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రెడ్డీస్ ల్యాబ్ కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. గురువారం రెడ్డీస్ ల్యాబ్ ను సందర్శించిన ఆయనతో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గం శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కె. సాయి ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు.

సహపంక్తి భోజనం అనంతరం ల్యాబ్ లో ఉన్న బాయిలర్స్ ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో కర్మాగారాల భద్రత జిల్లా అధికారి రాంబాబు, రెడ్డీస్ ల్యాబ్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply