జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కొలికపూడి ధర్నా..

జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కొలికపూడి ధర్నా..

భూకబ్జాలపైఎమ్మెల్యే ఆగ్రహం..
ఏ కొండూరు లో ఉద్రిక్తత
10 రోజుల్లో సర్వే చేస్తామన్న అధికారుల హామీ
ప్రభుత్వ స్థలాలను కాపాడాలి
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్
కబ్జాదారులను వెంటనే ఖాళీ చేయించాలి
పది రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం
ఎమ్మార్వో, పోలీసులు, ఇతర అధికారులు..

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి వెంట భూకబ్జాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆందోళనకు దిగారు. స్థానికంగా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి కబ్జాదారులపై తీవ్రంగా స్పందించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాలు అక్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయని పేర్కొంటూ, వెంటనే వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొలికపూడి డిమాండ్ చేశారు. కబ్జాదారులను ప్రభుత్వ భూముల నుంచి ఖాళీ చేయించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ధర్నా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. ఎమ్మార్వో సహా రెవెన్యూ అధికారులు సమస్యను పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పది రోజుల్లో పూర్తి స్థాయి సర్వే నిర్వహించి భూసంబంధిత వివాదాలను క్లియర్ చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నిరసనను విరమించారు. ఈ ఘటన స్థానికంగా భూకబ్జాల సమస్యపై మళ్లీ చర్చకు దారితీసింది. ప్రభుత్వ స్థలాల రక్షణపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Leave a Reply