ఇందిరాదేవి పై చర్యలు నిలుపుదల..

ఇందిరాదేవి పై చర్యలు నిలుపుదల..

గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. ఇందిరా దేవి 2024 డిసెంబరులో ముఖ గుర్తింపు హాజరులో అవకతవకలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల పై గతంలో చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. దాన్ని తాజాగా నిలుపుదల చేస్తూ సంబంధిత శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులను జారీ చేశారు.

గతంలో అధికారులు విచారించి చర్యలకు ఆదేశించగా ఇందిరా దేవి ఇచ్చిన సమాధానానికి చర్యలు నిలుపుదల చేశారు. ఉద్దేశ పూర్వకంగా హాజరు నమోదులో ఎటువంటి అవకతవకలు చేయలేదని ఆమె ఉన్నతాధికారులకు తెలపడంతో చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసింది.

Leave a Reply