ఘనంగా ఎమ్మెల్యే బూచేపల్లి జన్మదిన వేడుకలు..

ఘనంగా ఎమ్మెల్యే బూచేపల్లి జన్మదిన వేడుకలు..
దర్శి, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం దర్శి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ వేడుకలు జరిగాయి. పట్టణమంతా భారీ ఫ్లెక్సీలు,హోర్డింగ్లతో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం నుండి ఆయన రాక కోసం ఎదురుచూసి సాయంత్రం ఆయన నివాసానికి భారీగా నాయకులు కార్యకర్తలు చేరుకొని బాణాసంచా కాల్చి జన్మదిన సంబరాలు చేసుకున్నారు.
ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైసిపి ఇన్చార్జ్ అన్నా రాంబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కుటుంబ సభ్యుల మధ్యలో ఎమ్మెల్యే బూచేపల్లి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాల నుండి పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
