Counter కేంద్ర మంత్రా? కార్పొరేట‌రా? – బండి సంజ‌య్‌పై ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. ఇంత‌కూ బండి సంజ‌య్ కుమార్‌కు చ‌దువు వ‌చ్చా? పాన్‌షాపుల ద‌గ్గ‌ర గుట్కాలు వేసుకునేడిలా మాట్లాడుతున్నార‌ని అన్నారు. కేంద్ర మంత్రి స్థాయికి త‌గిన‌ట్లు మాట్లాడ‌టం లేద‌ని అన్నారు. బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కార్పొరేటరా? కేంద్ర మంత్రా? అనే అనుమానం క‌లుగుతుంద‌ని అన్నారు. త‌మ పార్టీ అధినేత కేసీఆర్ మీద ప్ర‌తి అడ్డ‌మైన వ్య‌క్తులు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ పై చేసిన ఆరోప‌ణ‌లు రుజువు చేయాల‌ని కేంద్ర మంత్రి సంజ‌య్ కుమార్‌కు స‌వాల్ చేశారు.

Leave a Reply