ఘనంగా శిలువ యాత్ర…..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : గుడ్ ఫ్రైడే సందర్భంగా మండల కేంద్రంలో క్రైస్తవ సోదరులు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా శిలువ యాత్ర నిర్వహించారు. పట్టణంలోని ఆర్‌సీఎం చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చర్చ్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన శిలువ యాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగి భక్తిమయ వాతావరణాన్ని సృష్టించింది.

యేసుక్రీస్తు భూలోకంలో పాపుల రక్షణ కోసం అనుభవించిన శ్రమలు, ఆయన శిలువ మార్గం, మానవాళి విమోచన కోసం చేసిన మహాత్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు శిలువను మోస్తూ ప్రార్థనలు చేశారు. మార్గమధ్యంలో చర్చ్ పెద్దలు, ఆధ్యాత్మిక నాయకులు యేసుక్రీస్తు శిలువ వేయబడిన ఘటన, అనంతరం మూడవ రోజు పునరుత్థానమైన మహిమను ప్రసంగాల ద్వారా వివరించారు. భక్తులు పాటలు, స్తోత్ర గీతాలతో యాత్రలో పాల్గొని శాంతి, ప్రేమ, త్యాగ సందేశాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు నిర్వహించగా, ఈ దీక్షలు ఆదివారం ఈస్టర్ వేడుకలతో ముగియనున్నట్లు చర్చ్ నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply