Nandyala | బైక్ మెకానిక్ ఆత్మహత్య..

నంద్యాల బ్యూరో, జనవరి 30 : నంద్యాల జిల్లాలోని సిరివెళ్ల మండలం చెన్నూరుకు చెందిన బైక్ మెకానిక్ హుస్సేన్ (35) గురువారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హుస్సేన్ సుమారు 4లక్షల రూపాయల పైనే అప్పు చేసినట్లు, ఆ బాధలు భరించలేక గోస్పాడు మండలం సాంబవరం మేట్ట వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్సేన్ కు ఇద్దరు ఆడపిల్లలున్నారు. హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడంతో భార్య, బంధువులు రోసిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *