అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే…

అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే…
ఎన్టీఆర్ సర్కిల్లో తెలగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాల గద్దె అనురాధ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అంటే తెలుగువారి పండుగ అన్నారు. తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్థి, ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళుతున్నారన్నారు.

కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పేదలకు ఇళ్ళు, రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలను అనాడు ఎన్టీఆర్ ఇచ్చారన్నారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలను సూపర్‌హిట్‌గా అమలు చేస్తున్నారన్నారు. నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన పథకాలను నారా లోకేష్ మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. అందరి సంక్షేమం కోసం స్థాపించిన పార్టీని నాయకులు, కార్యకర్తలు 44 సంవత్సరాలుగా ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చారంటే ఆయన సంకల్ప బలం చాలా గొప్పదని చెప్పారు. నేడు వృద్ధులు, వికలాంగులు, వింతతువులు ఫించన్లు తీసుకుంటున్నారంటే అది ఎన్టీఆర్ వల్లనేనని అన్నారు.

మన రాష్ట్రంలో ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఫించన్ల పథకాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. పేదలకు పక్కా గృహల పథకాలను అందచేసిన ఘనత కూడా ఎన్టీఆర్దేనని చెప్పారు. రాష్ట్రంలోని పేదలకు రేపు సోమవారం టిడ్కో ఇళ్ళను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందచేస్తున్నారన్నారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అమలు చేస్తున్నారు. ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్థిని అందచేస్తున్న తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళతామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొప్పన భవకుమార్, బొర్రా గాంధీ, సి.హెచ్. గాంధీ, టి.ప్రేమనాధ్, జె.సాంబశివరావు, ఎ.ప్రసాద్, సి.హెచ్. ఉషారాణి, పేరేపి ఈశ్వర్, గురు ప్రసాద్, రాధారపు యల్లబాబు, కర్ణ రమేష్, అన్నాబత్తుల శ్రీదేవి, మాదల రాజ్యలక్ష్మి, లక్ష్మి, నాగమణి, పామర్తి కిషోర్, సి.హెచ్.రమణ, యర్నేని వేదవ్యాస్, రత్నశ్రీ, చిట్టా నిర్మల ఇంకా అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.
