అన్ని శాఖల సమన్వంతో వెస్ట్ ను బెస్ట్ గా తీర్చిదిద్దాలి…

అన్ని శాఖల సమన్వంతో వెస్ట్ ను బెస్ట్ గా తీర్చిదిద్దాలి…

పశ్చిమ నియోజకవర్గం సమీక్షలో ప్రత్యేక అధికారి మధు పిలుపు..

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబందించి అంతర్ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. నియోజకవర్గ ప్రత్యేక అధికారి మధు ఆధ్వర్యంలో చిట్టినగర్ లోని సర్కిల్-1 కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు . విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులతో కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను సమగ్రంగా సమీక్షించారు.

ముఖ్యంగా స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా శాఖలవారీగా పెండింగ్ సమస్యలు, ప్రజా ఫిర్యాదులు ,వినతిపత్రాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, అంశాలను ఆయా అధికారులతో చర్చించారు. వివిధ శాఖల మధ్య సమన్వయ అంశాలు, అదే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల నుంచి యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ సమర్పణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రత్యేకంగా మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఆరోగ్య సర్వే నిర్వహించడం, గుండెపోటు , కార్డియాక్ అరెస్టు వంటి ప్రాణాంతక వ్యాధుల నియంత్రణ, నివారణకు ముందస్తు ఆరోగ్య పరీక్షలు,ఆరోగ్య అవగాహన చర్యలు చేపట్టడం, తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా అన్ని శాఖల మధ్య బలమైన సమన్వయం, ప్రజా ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం చేసే విదంగా ముందుకు సాగడం, అదే విధంగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ను వేగవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సుజనా ఫౌండేషన్ సహకారంతో “హృదయ రక్ష” అనే కార్యక్రమం ద్వారా అత్యవసర గుండె సమస్యలు ఎదుర్కుంటున్న సామాన్య ప్రజలకు అందించే వైద్య సేవల పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాబోయే కాలంలో నియోజకవర్గంలో ప్రజలకు గుండె పోటు వస్తే వారికి సకాలంలో చికిత్స అందించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు రూట్ మ్యాప్ పై సమావేశంలో చర్చ జరిగింది.

అదే విధంగా డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం ను కూడా విస్త్రుత పర్చాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఎం.మధు, సుజన ప్రాజెక్ట్స్ & ఫౌండేషన్ టీమ్, డీఎంహెచ్ఓ సుహాసిని, తహశీల్దార్, రిబికా రాణి, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వి.శ్రీనివాసరావు, ఉదయ్ కుమార్, డాక్టర్ శ్రీలక్ష్మి, రమణకుమార్, హరీష్, ఏసీపీ దుర్గారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply