తహసిల్దార్ ఎదుట 19 మంది నిధింతులు బైండోవర్

తహసిల్దార్ ఎదుట 19 మంది నిధింతులు బైండోవర్

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలో వివిధ కేసులలో పట్టుబడిన 19 మందిని బైండోవర్ చేసినట్టు నిర్మల్ ఎక్సజ్ ఇన్స్పెక్టర్ రంగస్వామి తెలిపారు. ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం కడెం మండలంలో 19 మంది, మంది వివిధ కేసులలో పట్టుబడిన నిందితులను కడం తహసీల్దార్ యమ్.లచ్చిరాం ముందు బైండోవర్ చేసినట్టు నిర్మల్ ఎక్సైజ్ సీఐ రంగస్వామి తెలిపారు. బైండోవర్ ఉల్లంగించి నాటుసారాయి అమ్మిన వారికి 2 లక్షల జరిమానా లేదా 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. .

అంతకు ముందు కడెం మండలంలోని మద్దిపాడగ గ్రామానికి చెందిన తిరుపెల్లి శ్యామల నాటుసారాయి అమ్ముతు పట్టుబడినది ఆమె పై కేసు నమోదు చేసి 15 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపినారు. నాటుసారాయి తయారు చేసిన, అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. దీనిలో నిర్మల్ ఎక్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ అభిషేకర్, వసంత్ రావు , సిబ్బంది రషీద్, ప్రకాష్, వెంకటేష్, హరీష్, సాయన్న, రాజేందర్, కల్పనా, రవళి పాల్గొన్నారు.

Leave a Reply