ఈనెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం

ఈనెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం
శ్రీ సీతారాముల తలంబ్రాలు తయారు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం మహిళా భక్త మండలి ప్రతినిధులు శ్రీ సీతారాముల తలంబ్రాలు వడ్లు వలిచి తయారు చేసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒడ్లువలచి తలంబ్రాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని, చౌటుప్పల్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిళ్ళ సంధ్య, దేవాలయ ధర్మకర్త వర్కాల వెన్నెల, వెన్ రెడ్డి సంధ్య, బొబ్బిళ్ళ సంధ్య, కామిశెట్టి శ్రీదేవి ఉప్పల కుసుమ, ముత్యాల రామ నర్సమ్మ, మచ్చ అంబిక, డాక్టర్ మంచికంటి రాజేశ్వరి, ఉప్పల దీపిక, వనం మమత, దాడి పద్మ, నిమ్మల అండాలు, జూకంటి రేవతి, గర్దాసు లక్ష్మి, యామిని, మల్లె శాలిని, రాజపేట శ్రీలత, మామిడి వెంకటమ్మ, నెక్కంటి అనూష, రమాదేవి, బద్దం స్వప్న, కథాల ఆశ, గోషిక లక్ష్మి, బొడిగె లావణ్య, మచ్చ అంబిక తదితరులు పాల్గొన్నారు.
