తాళ్లగురిజాలలో కంటి వైద్య శిబిరం.. 50 మందికి పరీక్షలు

తాళ్లగురిజాలలో కంటి వైద్య శిబిరం.. 50 మందికి పరీక్షలు

15 మందికి కంటి సమస్యల గుర్తింపు.. ఆపరేషన్లకు సర్పంచ్ హామీ

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వంగ రామన్న గౌడ్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్థుల నుండి మంచి స్పందన లభించింది. కంటి నిపుణులు అంజయ్య సుమారు 50 మందికి పైగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు తగిన జాగ్రత్తలు సూచించారు. లయన్స్ క్లబ్ సహకారంతో చికిత్స: ఈ సందర్భంగా సర్పంచ్ రామన్న గౌడ్ మాట్లాడుతూ.. గ్రామస్థుల విన్నపం మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల్లో 15 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని, వారికి లయన్స్ క్లబ్ సహకారంతో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ డాకూరి సురేష్, లయన్స్ క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షురాలు అరుణ సుందరి, రంగు సందీప్ గౌడ్, మెరుగు మల్లేష్, కృష్ణ గౌడ్, నక్క రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply