Dysfunction | సర్వర్ సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు

Dysfunction | సర్వర్ సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు
Dysfunction | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సర్వర్లు పనిచేయకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి.
సర్వర్ సమస్యల కారణంగా భూబదలాయింపు ప్రక్రియలు ఆగిపోవడంతో పాటు, స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
