AP | వ‌చ్చే నెల 3న మంత్రి వర్గ సమావేశం..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వ‌చ్చే నెల (ఏప్రిల్) 3న జరగనుంది. ప్ర‌తీ నెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయంతో.. మూడవ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జ‌రిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు ఆమోదం లభించనుంది.

రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించాల్సిన అంశాలను ఈ నెల 27వ తేదీలోపు పంపాలని అన్ని శాఖలకు ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply